Header Banner

గచ్చిబౌలి భూ వివాదంపై తెలంగాణ సచివాలయంలో కీలక సమావేశం! సర్కారు కీలక ఆదేశాలు జారీ!

  Mon Apr 07, 2025 19:40        Politics

కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అయిన హైదరాబాద్ కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూ వివాదంపై తెలంగాణ సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. మంత్రుల కమిటీతో UoH(యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్) ఉపాధ్యాయ సంఘం, పౌర సమాజ ప్రతినిధులు భేటీ అయ్యారు. మంత్రుల కమిటీలో మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, మీనాక్షి నటరాజన్ , వంశీ చంద్ రెడ్డి ఉన్నారు. క్యాంపస్‌లో పోలీసుల ఉపసంహరణ, నిషేధాజ్ఞల తొలగింపు చేయాలని ఈ సందర్భంగా ప్రతినిధుల సంఘం డిమాండ్ చేశారు. నిరసనలకు సంబంధించి పెట్టిన కేసులు ఉపసంహరించాలని, కస్టడీలో ఉన్న విద్యార్థులను విడుదల చేయాలని పౌర సంఘాలు డిమాండ్ చేశాయి. 400 ఎకరాల్లో నష్టం అంచనా, జీవవైవిధ్య సర్వేకు అనుమతి కోరుతూ విజ్ఞప్తి చేశారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భూమిలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుందని ఈ సందర్భంగా ప్రతినిధులకు మంత్రుల బృందం తెలిపింది. క్యాంపస్ నుంచి పోలీస్‌లను వెనక్కు తీసుకునే ప్రక్రియపై యూనివర్సిటీతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత!


విద్యార్థుల కేసుల విషయం సానుభూతితో సమీక్షిస్తామని మంత్రులు బృందం హామీ ఇచ్చారు. అయితే, కోర్టు ఆదేశాల కారణంగా సర్వేకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే క్యాంపస్ సందర్శనకు సిద్ధమని మంత్రుల కమిటీ ప్రతినిధుల బృందానికి తెలియచేసింది. ఇలా ఉండగా, మీటింగ్ ముగిసిన వెంటనే తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్సియు(HCU) విద్యార్థులపై నమోదైన కేసులు ఉపసంహరణ చేయండిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలో సమావేశం అనంతరం ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని, దీంతో పాటు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసుల వాపసుకు ఆదేశాలిచ్చారు. దీనికి సంబంధించి పోలీసులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేయాలని న్యాయశాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. హెచ్సియు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇలా ఉండగా, తమ డిమాండ్లు నెరవేర్చలేదన్న కారణంతో విద్యార్థుల JAC భేటీకి దూరంగా ఉంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Gachibowli #TelanganaSecretariat #LandDispute #GovernmentOrders #TelanganaNews #BreakingNews #TelanganaGovernment